
-
కులగణన, బీసీ రిజర్వేషన్లపై వివరించిన రేవంత్
-
ఈ అంశాలపై పార్లమెంట్‌లో ఒత్తిడి తేవాలని వినతి
క్రైమ్ మిర్రర్, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టితో కలిసి రేవంత్ సమావేశమయ్యారు. సుమారు రెండుగంటల పాటు ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశంపై రాహుల్, ఖర్గేకు రేవంత్ వివరించారు. ఈ అంశాలపై పార్లమెంట్‌లో కేంద్రం ఒత్తిడి తేవాలని వారికి సూచించారు.
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో చేపట్టిన కులగణన ఎంతో పారదర్శకంగా, పకడ్బంధీగా చేపట్టామని సీఎం రేవంత్ వివరించారు. ఇదే అంశంపై ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం వివరించనున్నట్లు తెలుస్తోంది. బడుగు బలహీనవర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని దేశవ్యాప్తంగా తెలియజెప్పేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
Read Also: