
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి ఏసుప్రభు జన్మించారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నాకు అన్ని మతాలు కూడా సమానమే అంటూ పేర్కొన్నారు. నేనే కాదు తమ ప్రభుత్వం కూడా అన్ని మతాలను సమానంగా చూస్తుంది అని వెల్లడించారు. ఎవరైనా సరే ఇతర మతాలను కించపరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని.. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఈ విషయంపై ఒక చట్టమే తీసుకు వస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిని కాపాడుతున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాము అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ఆయా రాజకీయ నాయకులు అలాగే సినిమా ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. ఇక ఈనెల 25వ తేదీన దేశవ్యాప్తంగా,ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకొనున్నారు.
Read also : పిల్లలు పుస్తకాలకే పరిమితమైతే ఎలా..?
Read also : మీకు యోగి ట్రీట్మెంట్ కరెక్ట్.. ప్రతిపక్షానికి పవన్ కళ్యాణ్ వార్నింగ్?





