
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- కేటీఆర్ పై కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని కాంగ్రెస్ ప్రభుత్వం పై తాజాగా హరీష్ రావు మండిపడ్డారు. గత మా ప్రభుత్వంలో ఫార్ములా ఈ-కార్ రేసును పూర్తి పారదర్శకతతో నిర్వహించామని తెలిపారు. తాజాగా కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై హరీష్ రావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటాము అని హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కావాలనే ప్రశ్నించే గొంతులను సీఎం రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. మాపై కావాలనే అక్రమ కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేయాలని చూస్తున్నారు అని.. న్యాయపరంగానే ప్రతి ఒక్కటి కూడా దాటుకొని ముందుకు వెళ్తాము అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని తెలియజేశారు. అధికారం వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అని.. సీఎం దుర్మార్గపు వైఖరిని న్యాయపరంగానే ఎదుర్కొంటామని హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు.
Read also : తాళ్లరేవు పోస్టాఫీసులో ఉద్యోగి నిర్వాకం…ఫోన్‌లో అశ్లీల వీడియోలు
Read also : హైదరాబాదుకు చేరుకున్న జగన్.. చూసేందుకు ఎగబడ్డ జనం!





