ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికకో పార్టీతో పొత్తు పెట్టుకుని సీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నారు : కాకాణి గోవర్ధన్

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తాజాగా వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ తీవ్రంగా మండిపడ్డారు. PPP విధానం వల్ల విద్యార్థులకు ఎక్కడా కూడా లాభం కలగదు అని వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకంగా కోటి మంది సంతకం చేశారు. అదంతా కూడా ప్రజలు ఆలోచించే సంతకాలు చేశారు.. కానీ కోటి సంతకాలు చేసినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం లెక్కలేని తనంతో వ్యవహరిస్తున్నారు అని కాకాని గోవర్ధన్ తీవ్రంగా విమర్శించారు. గత వైసిపి ప్రభుత్వం లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అన్ని విధాలుగా మేలు చేయడమే కాకుండా వైద్య రంగాన్ని కూడా అభివృద్ధి చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం మాత్రం వాటన్నిటిని నీరుగార్చి ప్రైవేటుతో మేలు చేస్తాము అని చెబుతుంటే ఎవరు నమ్మే వాళ్ళు లేరు అని స్పష్టం చేశారు.

Read also : పెన్సిల్ ఛాతిలో గుచ్చుకొని UKG బాలుడు మృతి!

ఎన్నికలకు ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తూ మళ్లీ అవి హుందా పాలిటిక్స్ అని చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కాగా గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి మెడికల్ కాలేజీలను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత PPP విధానంలో మెడికల్ కాలేజీ లను కట్టాలి అని వెల్లడించిన తర్వాత దీనిని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తూ వైసిపి పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. తాజాగా కోటి సంతకాల సేకరణ కూడా పూర్తయింది అని దీనిని గవర్నర్ దృష్టికి కూడా వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకువెళ్లి వివరించిన విషయం తెలిసిందే. అయితే ఒక వైపు కూటమి ప్రభుత్వం PPP విధానం తోనే మెడికల్ కాలేజీలు కడతామని మరోవైపు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దు అంటూ వైసీపీ చేస్తున్న నినాదాలు పట్ల మీరు ఎవరి నిర్ణయం సరైనదని అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Read also : ఆన్ లైన్ గేముకు బలైపోయిన దెబ్బడ గూడ గ్రామానికి చెందిన వాస్పురి విక్రమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button