క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారత స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు బీసీసీఐ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించనుంది. క్రికెట్ గాడ్ గా పిలవబడే సచిన్ కు ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో రేపు జరిగే వార్షిక కార్యక్రమంలో ది గ్రేట్ సచిన్ కు ఆ పురస్కారాన్ని అందించనుంది. అయితే మన భారతదేశం తరఫున సచిన్ ఎన్నో క్రికెట్ మ్యాచెస్ ఆడారు. ఇండియన్ టీంకు నిరంతరం తన పట్టుదల కృషితో ఎన్నో మ్యాచ్లను ఒంటి చేతితో గెలిపించిన రోజులు చాలానే ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా అతనిని క్రికెట్ గాడ్ అని పిలుస్తుంటారు.
ఏపీ టెన్త్ విద్యార్థులు అలెర్ట్!… పరీక్షల షెడ్యూల్లో మార్పు?
ఇప్పటివరకు భారతదేశం తరఫున సచిన్ 664 మ్యాచులు ఆడారు. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టెస్ట్ మరియు వన్డే పరుగులను చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అయితే మాజీ ఆటగాళ్లు రవి శాస్త్రి మరియు ఫరూక్ ఇంజనీర్ కు 2023లో ఈ పురస్కారం లభించిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా సచిన్ కు కూడా సికే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించనుంది. సీకే నాయుడు మన భారతదేశ క్రికెట్ టీంకు మొట్టమొదటి కెప్టెన్. కాబట్టి అతని పేరు మీద పురస్కారాన్ని సచిన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కింద ఇస్తున్నారు. దీంతో సచిన్ ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషిస్తున్నారు.