-
నగరం నిద్రపోతున్న వేళ…. అమావాస్య అర్థరాత్రి
-
సమాధిలో గడియారం ఏమని అంటుంది?
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక కథనం సస్పెన్స్ థ్రిల్లర్ : నగరం నిశ్శబ్దంలో మునిగిపోయింది. రాత్రి గడియారం పన్నెండు కొట్టింది. అమావాస్య చీకటి నగరాన్ని పూర్తిగా మింగేసింది. వీధిదీపాలు కూడా కొన్నిచోట్ల మసకబారగా వెలుగుతున్నాయి.
ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఒక్కసారిగా పాత స్మశానవాటికలో ఉన్న గడియారం టక్… టక్… అని మోగడం మొదలుపెట్టింది. సాధారణంగా ఆ గడియారం సంవత్సరాలుగా పని చేయడం లేదు. స్థానికులు చెబుతున్నట్టు అది బ్రిటిష్ కాలం నాటి నిర్మాణం. ఎన్నో ఏళ్లుగా ఆ గడియారం సూదులు కదల్లేదు. కానీ ఆ రాత్రి… అమావాస్య అర్థరాత్రి… అది మళ్లీ ప్రాణం పోసుకున్నట్టుగా మోగింది.
అనుమానాస్పద కదలికలు…
అదే సమయానికి సమాధుల మధ్య ఓ నీడ కదిలింది. అక్కడి సీసీటీవీ కెమెరాలు ఆ సమయంలో పనిచేయడం ఆగిపోయాయి. సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లోని ఒక యువకుడు కిటికీ నుంచి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు చేరుకునేలోపే, ఆ ప్రాంతంలో ఒక సమాధి తెరిచి ఉన్నట్టు గుర్తించారు. సమాధి పక్కన పాత గడియారం సూళ్లు కచ్చితంగా 12:07 నిమిషాల వద్ద ఆగిపోయాయి.
సమాధి లోపల నుండి ఒక పురాతన డైరీ బయటపడింది. ఆ డైరీలో రాసిన వాక్యం పోలీసులను షాక్‌కు గురి చేసింది. గడియారం మోగినప్పుడు నిజం బయటపడుతుంది… డైరీ చివరి పేజీలో నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త పేరు ఉంది. విచారణలో తెలిసింది ఏమిటంటే, అతను కొన్నేళ్ల క్రితం అనుమానాస్పదంగా మరణించాడు.
ఆ కేసు అప్పట్లో సహజ మరణం గా నమోదు కావడం. ఆ సమాధి ఇటీవలే తెరవపడినట్లు కనిపించింది.కానీ గడియారం మెకానిజం కూడా కొత్తగా సెట్ చేసినట్టు కనిపించింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు… ఎవరో పథకం ప్రకారం చేసిన పని ఈ గడియారం మోగడం ఒక సంకేతం.
ఎవరో పాత కేసును తిరిగి తెరవాలని ప్రయత్నిస్తున్నారా? లేక మరొక పెద్ద కుట్రకు ఇది ప్రారంభమా? అన్నట్లు నగరంలో భయం తో కూడిన అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. స్మశానవాటిక చుట్టూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో రాత్రిపూట ఎవ్వరినీ అనుమతించడం లేదు. కానీ ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది… అమావాస్య అర్థరాత్రి ఆ గడియారం ఎందుకు మోగింది? ఆ సమాధి లోపల దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి? దర్యాప్తు కొనసాగుతోంది…
మరిన్ని సంచలన విషయాలు మరో కథనం వెలుగులోకి రానున్నాయి..!
