సినిమా

విశ్వంభర స్టోరీ ఏంటో చెప్పేసిన చిరు... మరో అంజి కానుందా అంటూ ట్రోలింగ్..?

Meghastar Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి #Chiranjeevi హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంభర. ఈ సినిమాకి బింభిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వసిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి తదితరులు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే మరోసారి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఏడాది కూడా రిలీజ్ కావడం లేదని కన్ఫర్మ్ చేయడంతో మెగా అభిమానులు కొంతమేర నిరాశకి గురవుతున్నారు.

ఐతే ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాకి సంబంధించి బ్లాక్ బస్టర్ అనౌన్స్మెంట్ ఉంటుందని సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ షేర్ చేశారు. దీంతో ఏమై ఉంటుందా అని అప్పటినుంచి మెగాస్టార్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రీసెంట్ గా చిరంజీవి విశ్వంభర రిలీజ్ ఎందుకు లేట్ అవుతుందనే విషయంపై స్పందిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో విశ్వంభర సినిమా రిలీజ్ వాయిదా పడుతున్నప్పటికీ కచ్చితంగా ఆడియన్స్ కి మంచి కంటెంట్ అందించాలని ఉద్దేశంతో పని చేస్తున్నామని తెలిపారు.

అలాగే విశ్వంభర సినిమా చందమామ స్టోరీ లాగా ఉంటుందని కచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా సెకండాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్ మరియు గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంటుందని అందుకే ఈ పనులు పూర్తవడం కొంతమేర లేట్ అవుతుండటంతో ఆకారణంగానే రిలీజ్ కూడా లేట్ అవుతుందన క్లారిటీ ఇచ్చాడు. అలాగే విశ్వంభర సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపాడు.

https://x.com/KChiruTweets/status/1958373369864417507?t=HC1EHmmPiEmmr7muNrD5zQ&s=19

ఈ విషయం ఇలా ఉండగా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అంజి సినిమా కూడా భారీ విఎఫ్ఎక్స్ తో రిలీజ్ అయింది. కానీ అప్పటికి ఆడియన్స్ మైండ్ సెట్ కి ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాలేక ఫ్లాప్ గా నిలిచింది. దీంతో ఈసారి మళ్లీ విశ్వంభరలో విఎఫ్ఎక్స్ మరియు గ్రాఫిక్స్ తో ప్రయోగాలు చేస్తుండడంతో ఈ సినిమా కూడా మరో అంజి కానుందా…? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు గత ఏడాది రిలీజ్ చేసిన విశ్వంభర టైటిల్ గ్లింప్స్ ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కొందరు ఏకంగా ఈ సినిమాలోని రెక్కలగుర్రం సన్నివేశాల్ని చూసి ఏకంగా అమీర్పేట్ ఎడిటింగ్ ఎడిటింగ్ అంటూ ట్రోల్ చేశారు. మరి ఫైనల్ గా విశ్వంభర ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button