ఆంధ్ర ప్రదేశ్

అమరావతి సభకు గైర్హాజరైన చిరంజీవి… అసలు కారణం ఇదే?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఎంతో ఘనంగా నిన్న అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ పర్యటన ఘనంగా ముగిసింది. అమరావతి రాజధానిగా పలు శంకుస్థాపన కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అక్కడ పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అమరావతి భవిష్యత్తు పైన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మోడీ తన అభిప్రాయాలను, అంచనాలను వెల్లడించడం జరిగింది. అయితే ఈ సభకు చాలామంది ప్రముఖులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఇందులో మరియు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా చిరంజీవికి కూడా ఆహ్వానం అనేది పంపారు. కాగా ఒకవైపు జగన్ అలాగే మరో వైపు చిరంజీవి కూడా ఇద్దరు ఈ సభకు గైర్హాజరయ్యారు. దీంతో వీళ్లిద్దరూ కూడా రాకపోవడంపై రాజకీయంగా చాలానే చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఒకానొక సమయంలో చిరంజీవి జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులు మంచి నిర్ణయం గా పేర్కొన్నారు చిరంజీవి. అమరావతి కోసం రైతుల నుంచి భూసేకరణ సరికాదని అభిప్రాయం కూడా చిరంజీవి వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఇలాంటి వ్యక్తిని అమరావతి వేడుకకు ఎలా పిలుస్తారు అనే ప్రశ్నలు ఈమధ్య సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతూ కనిపించాయి. కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావించి ప్రధానిని ఆహ్వానించి అమరావతి సభను నిర్వహించారు. తాజాగా ముంబైలో జరిగిన వేవ్స్ సదస్సులో చిరంజీవి పాల్గొన్నారు. దీంతో చిరంజీవి సభకు హాజరై వివాదాలకు అవకాశం ఇవ్వడం ఇష్టం లేక.. ఈ సభకు రాలేదని రాష్ట్రంలో పొలిటికల్గా బాగానే చర్చలు వినిపిస్తున్నాయి.

తడిసిన పంటను తక్షణమే కొనుగోలు చేసి, నష్టపరిహారం చెల్లించాలి: గోల్కొండ కిరణ్

రావిర్యాలలో శ్రీ లక్ష్మీ పెట్రోల్ బంక్ పై దాడి చేసిన దుండగులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button