జాతీయం

మళ్లీ పెరిగిన బంగారం ధర.. అమ్మో ఒకేసారి అంతా!

Gold Price Today: గత రెండు వారాలుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పెరిగింది. ఒకే రోజు ఏకంగా రూ. 1,200 పెరిగింది. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగింది. రూ.98,670కు చేరుకుంది. హైదరాబాద్‌ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,140 పెరిగింది.  ప్రస్తుతం రూ.98,400గా పలుకుతోంది.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,050 పెరిగింది. రూ.90,200గా నమోదైంది.  గత కొద్ది రోజులుగా బంగారం ధర సుమారు రూ. 3,000 వరకు తగ్గింది.

వెండి ధరలు కూడా!

బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో బంగారం ధర రూ. 2,000 పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,04,800గా పలికింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాలతో పాటు సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్‌ రావడంతో వెండి ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.

బంగారం ధరలు ఎందుకు పెరిగాయంటే?

అమెరికాలో ద్రవ్యలోటు ఆందోళనలు, ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం వైపు దృష్టిపెట్టారు. ఆయా దేశాల మీద ట్రంప్ ట్యాక్సులు విధించే అవకాశం ఉందన్న నిర్ణయం కూడా మదుపరులు బంగారం వైపు మళ్లేలా చేశాయంటున్నారు నిపుణులు. ఈ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారంపై పెట్టుబడులు పెరగడంతో దేశీ మార్కెట్ లోనూ పసిడి ధర పెరిగినట్లు తెలిపారు.

Read Also: అమర్ నాథ్ యాత్ర ప్రారంభం, భారీ భద్రత ఏర్పాటు!

Back to top button