
-
చిల్లీ చికెన్ ఆర్డర్ ఇచ్చారా..?
-
అందులో నిజంగా చికెనే ఉందా? లేక గబ్బిలమా..?
-
తమిళనాడులో చిల్లీ చికెన్‌లో గబ్బిలాల మాంసం
-
సేలం జిల్లాలో ఇద్దరు వ్యక్తుల గబ్బిలాల వేట
-
వేటాడిన గబ్బిలాల మాంసం చికెన్ సెంటర్లకు విక్రయం
-
ముఠా గుట్టురట్టు చేసిన అటవీశాఖ అధికారులు
క్రైమ్ మిర్రర్, నిఘా: నాన్ వెజ్ అంటే ఇష్టపడేవారు చాలా మందే. అందులో చికెన్ ప్రియులు కోకొల్లలు. చికెన్‌లో ఎన్నో వెరైటీలు. అందులో చాలా మంది మెచ్చేవి… మంచింగ్‌లోకి తెచ్చుకునేవి చిల్లీ చికెన్… చికెన్ పకోడీ. హోటల్‌కి వెళ్లినా… బార్‌కు వెళ్లినా.. ఎక్కువగా ఆర్డర్ ఇచ్చేవాటిలో ఈ రెండు వెరైటీలు ముందు వరసలో ఉంటాయి. తినేందుకు టేస్టీగా.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి చికెన్ పీసులు. ఏంటి వింటుంటూనే నోరూరిపోతుందా…? వెంటనే చికెన్ పకోడీనో.. చిల్లీ చికెనో ఆర్డ్‌ర్ ఇచ్చుకుని.. తినేయాలని ఉందా..? ఒక్క క్షణం ఆగండి. ఈ వార్త వింటే నోరూరడం కాదు… నోరెళ్లబెడతారు. చిల్లీ చికెన్‌ను.. చికెన్‌తో కాకుండా.. గబ్బిలం మాంసంతో తయారుచేస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసా…? ఛీ.. గబ్బిలంతో చిల్లీ చికెనా…? వింటుంటేనే కడుపుతో దేవేస్తోందా…? ఇది నిజం. తమిళనాడులో ఓ ముఠా చేస్తోంది ఈ దందా.
ఫ్రూట్ బ్యాట్లు అంటే పండ్లు తినే గబ్బిలాలను వేటాడి.. వాటి మాంసాన్ని చికెన్ పేరుతో అమ్మేస్తోంది ఈ ముఠా. అది నిజంగానే చికెనే అని నమ్మి… ఆరగించేస్తున్నారు జనం. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో బయపడింది. సేలం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అడవుల్లో గబ్బిలాలను వేటాడి.. వాటిని వండుతున్నట్టు అటవీశాఖ అధికారులకు సమాచారం వచ్చింది. వెంటనే నిఘా పెట్టారు. తనిఖీలు చేశారు. కమల్, సెల్వం అనే ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వీరిని ప్రశ్నించగా… షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
కమల్, సెల్వం.. వీరు తుపాకులతో అటవీ ప్రాంతానికి వెళ్లి గబ్బిలాలను వేటాడుతున్నారు. పట్టుకున్న గబ్బిలాలను ముక్కలు చేసి… ఆ మాంసాన్ని చికెన్ అని నమ్మిస్తున్నారు. అంతేకాదు.. గబ్బిలం మాంసంతో చిల్లీ చికెన్, చికెన్ పకోడీ తయారు చేసి అమ్ముతున్నారు. సమీపంలోని హోటళ్లు, బార్ల కూడా గబ్బిలంతో చేసిన చిల్లీ చికెన్, చికెన్ పకోడి పంపుతున్నారు. అది గబ్బిలంతో చేసిందని తెలియని జనాలు.. చికెన్ అనుకుని లొట్టలు వేసుకుని తింటున్నారు. ఈ ముఠా గుట్టును రట్టు చేశారు అటవీశాఖ అధికారులు. సో.. బీ కేర్‌ఫుల్… బయట నాన్‌వెజ్ వంటకాలు తినేటప్పుడు.. ఒక్కసారి చెక్ చేసుకోండి.
Read Also: