
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా గాలి కాలుష్య సమస్యపై ప్రభుత్వంతో చర్చను కోరారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాలలో గాలి కాలుష్యం నెలకొంది అని.. దీని ద్వారా ప్రజలు అనేకమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు అని వివరించారు. మన దేశంలో గాలి కాలుష్యం ప్రతిరోజు కూడా పెరిగిపోతూనే ఉంది.. వెంటనే వీటి పరిష్కార మార్గాలపై చర్చించాలి అని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా ఈ గాలి కాలుష్యం వల్ల ఈరోజు పిల్లలకు పూర్తిగా లంగ్స్ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఇక వృద్ధులైతే ఈ గాలి పీల్చుకోవడానికి చాలానే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు అని ఇటువంటి గాలి కాలుష్యంపై కీలక చర్చలు జరగాలని రాహుల్ గాంధీ కోరగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
Read also : వచ్చే మూడేళ్లు అధికారంలో ఉన్న పైసా అభివృద్ధి జరగదు : కేటీఆర్
గాలి కాలుష్య సమస్యపై చర్చకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అని లోకసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ దానికి పూర్తిగా మీకు సమయం ఇస్తుందని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ తెలిపారు. కాగా ఈ మధ్య దేశంలోని ముఖ్య నగరాలలో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. మరి ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఢిల్లీలో ఇప్పటికీ గాలి కాలుష్యం కారణంగా ప్రజలందరూ కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడం వల్ల ఇప్పటికే చాలామంది ప్రజలు వలస వెళ్లిపోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇటువంటి సమస్యలపై దృష్టి సారిస్తేనే ఢిల్లీ ప్రజలు ఆరోగ్యంతో ఉంటారు అని కొంతమంది నెటిజనులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read also : Missed Call Messages: వాట్సాప్‌లో మరో 2 కొత్త ఫీచర్లు





