 
						క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: మొంథా తుఫాను వల్ల తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యంగా వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో పర్యటిస్తారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఆయన ఏరియల్ సర్వే (గగనతల సర్వే) నిర్వహించనున్నారు.
హైదరాబాద్‌లోని బేగంపేట్ నుంచి మధ్యాహ్నం 12:45 గంటలకు బయలుదేరి, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు మధ్యాహ్నం 1:45కి చేరుకుంటారు.
Also Read: నేడే రెండో టీ20.. మ్యాచ్ జరగడం కష్టమే?
అనంతరం, ముంపునకు గురైన సమ్మయ్యనగర్, కాపువాడ వంటి ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులతో మాట్లాడతారు. తర్వాత కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, సహాయక చర్యలపై దిశానిర్దేశం చేస్తారు.
ముంపు ప్రాంతాల పర్యటన అనంతరం, ఆయన ఈరోజు సాయంత్రం జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారు. ఈ పర్యటన ద్వారా తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.
Also Read: ఈ జిల్లాలకు వర్షాల విముక్తి ఇంకెప్పుడు?
 
				 
					
 
						 
						




