
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హోం మంత్రి అనిత ప్రజలకు సూచనలు చేశారు. ఏపీలోని ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది. హోంమంత్రి వంగలపూడి అనిత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. వర్ష సూచనలు గురించి కలెక్టర్లకు వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటనప్పటికీ భారీ ఈదురు గాలులు వీచేటువంటి అవకాశం ఉంటుంది అని అన్నారు. ఉదయమైనా, పగలైనా లేదా రాత్రి అయినా కూడా అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని హోం మంత్రి అనిత కలెక్టర్లకు సూచించారు. ఈ వాయుగుండం ద్వారా ఎవరికి కూడా ఎటువంటి నష్టం లేదా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది అని స్పష్టం చేశారు. రోడ్లపై ఉన్నటువంటి చెట్లు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిస్తే వెంటనే వాటిని తొలగించండి అని… వీటి వల్ల కూడా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయని అన్నారు. అలాగే మరోవైపు వంశధార, నాగవల్లి వరదకు చాన్సు ఎక్కువగా ఉందని.. కాబట్టి అక్కడున్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు నెలల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నేడు, రేపు అలాగే ఎల్లుండి కూడా ఈ వాయుగుండం ద్వారా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు మరోసారి హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఈదురుగాలులు బాగా వీస్తాయని, ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు కాబట్టి ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని హోమ్ మినిస్టర్ అనిత ప్రజలను హెచ్చరించారు.
Read also : విషాదంగా మారిన కర్రల సమరం.. ఇద్దరు మృతి, 100 మందికి పైగా గాయాలు?
Read also : <a style="color:red"
href=”https://crimemirror.com/dussehra-celebrations-in-full-swing-from-galli-to-delhi/”>గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు!