సినిమా

Ilaiyaraaja: సోషల్‌ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు, హైకోర్టు తీర్పు!

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఫొటోను సోషల్ మీడియాలో ఉపయోగించకూడదని హైకోర్టు తీర్పు చెప్పింది. దానికి కారణం ఏంటంటే..

భారతీయ దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా విషయంలో కోర్టు ఆసక్తికర తీర్పు వెల్లడించింది. ఆయన ఫోటోలను ఇకపై సోషల్ మీడియాలో వాడకూడదని మద్రాస్ హైకోర్టు తాత్కాలిక తీర్పు చెపింది. ఫేస్‌ బుక్‌, ఎక్స్‌, ఇన్‌ స్టా గ్రామ్, యూట్యూబ్‌ లాంటి సోషల్ నెట్‌వ ర్కింగ్‌ సైట్లలో ఉపయోగించవద్దని తేల్చి చెప్పింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

రీసెంట్ గా ఇళయరాజా సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్లలో తన అనుమతి లేకుండా తన ఫొటోను ఉపయోగించడాన్ని నిషేధిం చాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఏఐ టెక్నాలజీ సాయంతో తన ఫొటోను మార్ఫింగ్‌ చేసి వాణిజ్యపరంగా వినియోగిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారని చెప్పారు. ఇది తన వ్యక్తిగత హక్కులను హరించే చర్య అని కోర్టుకు చెప్పారు. ఇకపై తన అనుమతి లేకుండా ఎవ్వరూ ఉపయోగించకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిం చారు. ఆయన అభ్యర్థనను పరిగణన లోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సెంథిల్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇళయరాజా ఫొటోలను ఆయన అనుమతి లేకుండా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లలో తాత్కాలికంగా ఉపయోగిం చరాదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తన పాటలు పాడకూడదని కోర్టుకెక్కిన ఇళయరాజా

అప్పట్లో తన అనుమతి లేకుండా తాను స్వరపరిచిన పాటలను పాడకూడదని కోర్టుకెక్కారు ఇళయరాజా. టీవీ షోలు, సంగీత కచేరీలు, ఇతర ఈవెంట్లలో తన పాటలు పాడకుండా నిషేధించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  అప్పట్లో ఈ వ్యవహారంపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. డబ్బులు తీసుకొని పాటలు కంపోజ్ చేసిన తర్వాత దాని రైట్స్ నిర్మాతలకు దక్కుతాయే తప్ప, ఆయనకు దక్కవని అప్పట్లో చర్చ జరిగింది. తాజాగా మరోసారి తన ఫోటోల విషయంలో కోర్టుకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

Back to top button