చండూరు,క్రైమ్ మిర్రర్: ఇటీవల జరిగిన చండూర్ మున్సిపల్ ఎన్నికల్లో పలు వార్డుల్లో పలువురు అధికార పార్టీకి చెందిన నాయకులు బీఫామ్ లేకున్నా నామినేషన్లు వేశారు. ఆ తర్వాత స్వయంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయా వార్డుల్లో క్యాండెట్లను డిక్లేర్ చేశారు. ఎవరైతే నామినేషన్లు వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన స్వయంగా ఫోన్ చేసి మీకు తగిన న్యాయం చేస్తాం విత్ డ్రా చేసుకోండి అని కూడా నచ్చ చెప్పారు.
ఓకే సార్ మీరు చెప్పారు కాబట్టి మీ మీద గౌరవంతో విత్ డ్రా చేసుకుంటాం అంటూ… సుప్పిని…. శుద్ధపూసని అంటూ చెప్పుకొచ్చారు …. కట్ చేస్తే ఆ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి నుంచి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నారు. అసలే ఓటర్లకు ఇతర ఖర్చులకు డబ్బులు పంచాల్సిన కౌన్సిలర్ అభ్యర్థులు మేం గెలిస్తే చాలు అనే ఒక ఉద్దేశంతో వాళ్లు అడిగినంత ముట్టజేపారు. సదరుశుద్ధపూసలు కరెక్ట్ గా పని చేశారా అంటే అవతలపాటి నుంచి కూడా ముడుపులు తీసుకుని సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచారు.
ఎమ్మెల్యే గారి మాటకంటే డబ్బులకే ప్రియాట్ ఇచ్చారు. ఇప్పుడు కొన్ని వార్డుల్లో మెజార్టీని పరిశీలిస్తే. సొంత పార్టీనాయకులే వెన్నుపోటు దారులుగా ఉన్నట్లుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి తెలిసినట్టుగా సమాచారం. అసెంబ్లీ సమావేశాన్ని నడుస్తున్న సందర్భంగా అతి త్వరలోనే విత్ డ్రా అయిన నాయకులు సొంత పార్టీ అభ్యర్థి నుంచి ఎంత తీసుకున్నారు. ఇక అవతల పార్టీ నాయకులు నుంచి కూడా ముడుపులు ఎంత ముట్టాయి… వీళ్లు ఎంతవరకు పార్టీకి అక్కరకు. వస్తారు అనే దాని పైన కూడా చర్చ చేయనున్నట్లు సమాచారం
