
చండూరు, క్రైమ్ మిర్రర్:- చండూరు మున్సిపాలిటీకి సంబంధించి 2,3, 12,15 నెంబర్ కలిగిన మడిగలకు అధికారులు బహిరంగ వేలం ప్రకటించారు. ఒక్కో మడిగకు 7,500 నెలవారీ అద్దె ప్రభుత్వ పాటగా నిర్ణయించారు. వేలంలో పాల్గొనదలచిన వారు 2,000 ఇచ్చి దరఖాస్తు ఫారాన్ని తీసుకోవడంతో పాటు 50,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇట్టి డిపాజిట్ తిరిగి ఇవ్వరు. అయితే దరఖాస్తు తేదీ బుధవారంతో ముగిసింది. కాగా ఒక్కో షాపుకు ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చింది. దీంతో అధికారులు మరో వారం రోజులు దరఖాస్తు తేదీని పెంచారు. మడిగల వేలంలో పాల్గొనేందుకు డీడీలు తీసేందుకు ముందుకు వచ్చే వారితో ముందుగానే కొందరు వ్యక్తులు ప్రైవేట్ వేలం నిర్వహిస్తూ ఎంతో కొంత ముట్ట చెబుతామని చెప్పి డీడీలు తీయకుండా బయట బయటే ఆపేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దీని మూలంగా మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి గండిపడటంతో పాటు అద్దె తక్కువగా ఉండడంతో ఈ రూపంలో కూడా ఆదాయానికి గండి పడుతుంది. మొత్తం 15 మడిగలు ఉండగా ఇందులో 11 మడిగలకు సంబంధించి లీజు ఇచ్చి 3 ఏళ్లు అవుతోంది మరో రెండు ఏళ్లలో కాలపరిమిత అయి పొనుంది. ఇప్పుడు వేలం నిర్వహిస్తున్న 4 మడిగలకు 5 ఏళ్ల కాలపరిమితితో లీజు ఇవ్వనున్నారు.
Read also : కల్తీ మద్యం ప్రచారం వేళా.. ఎక్సైజ్ శాఖ కొత్త రూల్స్..!
Read also : బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠత.. రేపే విచారణ..!