తెలంగాణరాజకీయం

చంద్రబాబు, జగన్ బీజేపీ బ్రదర్స్‌ - దొందూ దొందే అంటూ జగ్గారెడ్డి సెటైర్స్‌..!

క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో : ఏపీ రాజకీయాలపై సెటైర్లు వేశారు కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి. బీజేపీని కల్లు దుకాణంగా… చంద్రబాబు, జగన్‌ను అందులో కూర్చునే అన్నదమ్ములుగా పోల్చారాయన. ఎందుకలా పోల్చారు…? అసలు.. చంద్రబాబు, జగన్‌ను విమర్శించాల్సిన సందర్భం ఏమొచ్చింది…? అంటే… ఉందిగా ఓట్ల చోరీ అంశం. ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిందని రాహుల్‌ గాంధీ అంటుంటే… చంద్రబాబు తప్పుబట్టారు. ఏపీలో జరిగిందీ అదే… దానికి గురించి రాహుల్‌ ఎందుకు మాట్లాడలేదని జగన్‌ ప్రశ్నించారు. దీంతో… జగ్గారెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. రాహుల్‌ గాంధీనే విమర్శిస్తారా అంటూ… తన స్టైల్‌లో కౌంటర్‌ ఇచ్చేశారు.

దేశంలో ఓట్ల చోరీ జరుగుతోంది… ఎన్నికల కమిషన్‌ బీజేపీకి సపోర్ట్‌ చేస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఆరోపిస్తున్నారు. ఇటీవల కొన్ని ఆధారాలతో పాటు ప్రజంటేషన్‌ ఇచ్చారు. బతికున్నవారిని చనిపోయినట్టు చూపించారన్నారు. ఓటర్ల లిస్ట్‌లో చనిపోయినట్టు చూపించిన వారి దగ్గరకు వెళ్లి… కాఫీ తాగి.. వారంతా బతికే ఉన్నారంటూ చెప్పారు రాహుల్‌ గాంధీ. అంతేకాదు చనిపోయిన వారితో కాఫీ తాగడం బాగుందంటూ ఈసీపై సెటైర్లు కూడా వేశారాయన. ఇదిలా ఉంటే… ఓట్ల చోరీపై రాహుల్‌ గాంధీ విమర్శలను చంద్రబాబు తప్పుబట్టారు. వైఎస్‌ జగన్ కూడా రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు. 2024 ఏపీ ఎన్నికల్లో కూడా ఓట్ల చోరీ జరిగిందని.. రాహుల్‌ గాంధీ దాని గురించి ఎందుకు మాట్లాడటంలేదన్నారు. రేవంత్‌రెడ్డి ద్వారా చంద్రబాబు కాంగ్రెస్‌తో హాట్‌లైన్‌లో టచ్‌ ఉన్నారని విమర్శించారు. దీనికి కౌంటర్‌ ఇచ్చారు జగ్గారెడ్డి. ఓట్ల చోరీపై రాహుల్‌ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడాల్సింది పోయి… విమర్శిస్తారా అంటూ ఫైరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌కి బీజేపీ తండ్రి అయితే… జగన్‌, చంద్రబాబు కుమారులని అన్నారు. అంతేకాదు.. బీజేపీ ఒక కల్లు దుకాణమని… చంద్రబాబు జగన్‌.. ఆ దుకాణంలో కూర్చునే అన్నదమ్ములని సెటైర్లు వేశారు జగ్గారెడ్డి. రాష్ట్ర విభజనకు లెటర్‌ ఇచ్చిందే చంద్రబాబు, జగన్‌ అని అన్నారాయన. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని… దేశ ప్రజల స్వేచ్ఛను అణగదొక్కేకుట్ర చేస్తోందని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button