
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు చండి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు ఏనుగు సురేందర్ రెడ్డి సుగంధిని దంపతులు మాట్లాడుతూ ఆత్మకూరు గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు విరివిగా పండాలని ఈ హోమం చేస్తామన్నారు. ఈ హోమాన్ని బ్రహ్మశ్రీ జనగామ చంద్రశేఖర శాస్త్రి,పండిట్ అంకిత్ శర్మ నిర్వహించారు.ధర్మకర్తలు సురేందర్ రెడ్డి దంపతులు,యాదగిర్ రెడ్డి, సర్పంచ్ బీసు ధనలక్ష్మి,శంతన్ రాజు,ఎద్దు మత్యగిరి దంపతులు హోమంలో కూర్చున్నారు. బ్రిలియంట్ స్కూల్ విద్యార్థులు నృత్య ప్రదర్శన చేసారు.భక్తులకు అన్నదానం చేసారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ప్రతికంఠం పూర్ణచందర్ రాజు,మాజీ ఎంపిపి ప్రతికంఠం హేమలత రాజు,బీసు చందర్ గౌడ్,సోలిపురం పుల్లారెడ్డి,జక్క శివ్వారెడ్డి,తొర్ర విష్ణు,తదితరులు పాల్గొన్నారు.
Read also : క్రైమ్ మిర్రర్ దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎస్ఐ కోటేష్
Read also : క్రైమ్ మిర్రర్ పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి





