క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నలుగురికి అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన షూటర్ మనుబాకర్‌కు ఖేల్‌రత్న అవార్డు లభించింది. తొలుత ఖేల్‌రత్న నామినేషన్లలో లేని మనుబాకర్ పేరు లేకపోవడంతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. చెస్ ఛాంపియన్ గుకేశ్, పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌లను ఖేల్‌రత్న అవార్డుకు కేంద్రం ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో పాటు 32 మందికి అర్జున అవార్డులను ప్రకటించింది. చెస్ ప్లేయర్ డి గుకేష్‌ను కూడా ఖేల్ రత్న అవార్డుతో కేంద్రం సత్కరించనుంది.
Also Read : ముగిసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.. రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయాలు
గత నెల డిసెంబర్ 12న గుకేశ్ చెస్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ టైటిల్ గెలుచుకున్నాడు. కేవలం 18 సంవత్సరాల వయస్సులోనే ప్రపంచ ఛాంపియన్‌గా గుకేష్ నిలిచి వరల్డ్ రికార్డు సాధించాడు. హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ప్రవీణ్ కుమార్‌లకు కూడా ఖేల్ రత్న అవార్డు ఇవ్వనున్నారు. హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో భారత జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రవీణ్ కుమార్ హైజంప్ టీ64 ఈవెంట్‌లో దేశానికి బంగారు పతకాన్ని అందించాడు. ప్రవీణ్ కుమార్ ఆసియా రికార్డును బద్దలు కొట్టి ఈ ఘనత సాధించాడు. క్రీడా మంత్రిత్వ శాఖ 32 మంది అథ్లెట్లను అర్జున అవార్డుతో సత్కరిస్తుంది. వారిలో 17 మంది పారా అథ్లెట్లు ఉండడం విశేషం.
ఇవి కూడా చదవండి :
- త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్
- మేడ్చల్ సీఎంఆర్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తల్లిదండ్రులతో కలసి విద్యార్థినిల ఆందోళన
- వృద్ధులు, దివ్యాంగులకు గుడ్ న్యూస్.. నేరుగా శ్రీలక్ష్మీ నరసింహుడిని దర్శించుకునే భాగ్యం
- ప్రారంభమైన టెట్ పరీక్షలు.. 92 పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష
- పేదలకు గుడ్ న్యూస్… ఒక్కొక్కరికి ఆరు కిలోలు సన్న బియ్యం!!