
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఒక దేశ ప్రధాని అంటే అతనికి కొన్ని వేల కోట్ల ఆస్తి లేదా లక్షల కోట్ల ఆస్తులు ఉండడం చూస్తూ ఉంటాం. కానీ మన భారతదేశ ప్రధానమంత్రి ఆస్తులు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ షాకవ్వాల్సిందే. ఎందుకంటే ఈరోజుల్లో సర్పంచులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు లేదా ఎంపీల దగ్గరనే కొన్ని లక్షలు లేదా కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. కానీ ప్రస్తుతం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తులు విలువ కేవలం 3.02 కోట్లు మాత్రమే అని ADR ( అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ) అనే నివేదిక వెల్లడించింది. అంటే ఇతర దేశ ప్రధానులు అలాగే మంత్రుల ఆస్తులు కన్నా చాలా తక్కువ. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తులు ఈ 10 ఏళ్లలో 82% పెరిగాయి అని వెల్లడించింది.
Read also : ఆరుట్ల దంపతుల స్మారక క్రీడోత్సవాలు వీక్షించి అభినందించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
మరోవైపు లోకసభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ ఆస్తులు కూడా గడిచిన ఈ 10 ఏళ్లలో 117% వృద్ధి చెందినట్లు ప్రకటించారు. 2014వ సంవత్సరంలో రాహుల్ గాంధీ ఆస్తి 9.4 కోట్లు ఉండగా.. 2024 నాటికి 20.39 కోట్లకు చేరింది. ఎవరైతే వరుసగా మూడుసార్లు గెలిచిన ఎంపీలు ఉంటారో వారందరి ఆస్తి సగటున పదేళ్లలో 110 శాతం వృద్ధి పెరిగినట్లుగా ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ పేర్కొంది. అయితే ఈ విషయం తెలుసుకున్న సామాన్య ప్రజలు ఒక ప్రధానమంత్రి కి కేవలం మూడు కోట్లు మాత్రమే ఆస్తి ఉండడమేంటి అని.. ఆశ్చర్యపోతూనే మోదీని ప్రశంసిస్తున్నారు.
Read also : Vedanta: 75 శాతం సంపాదన దానం చేస్తా.. వేదాంతా అధినేత అనిల్ కీలక ప్రకటన!





