-
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు
-
వేములపల్లి ఎస్సై డి. వెంకటేశ్వర్లు.
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వేములపల్లి: సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు పాల్పడినా, రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినా ఉపేక్షించేది లేదని, వేములపల్లి ఎస్సై డి.వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో కొందరు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులే కాకుండా, ఇతర వ్యక్తులను సైతం లక్ష్యంగా చేసుకుని, అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, వారి గౌరవానికి భంగం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తామని ఈ సందర్బంగా హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, సమాజంలో విద్వేషాలు పెంపొందించేలా ప్రవర్తించవద్దని కోరారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా ఎస్సై విజ్ఞప్తి చేశారు. షార్ట్ అండ్ స్వీట్ వాట్సాప్/ఫ్లాష్ న్యూస్ కోసం, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జైలుకేనన్నారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే, కఠిన చర్యలు తప్పవని వేములపల్లి ఎస్సై డి. వెంకటేశ్వర్లు హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
