Sunday, February 22, 2026
Homeతెలంగాణజుక్కల్లో మాల్ ప్రాక్టిక్స్ కు పాల్పడిన 11 మందిపై కేసు నమోదు:జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

జుక్కల్లో మాల్ ప్రాక్టిక్స్ కు పాల్పడిన 11 మందిపై కేసు నమోదు:జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

జుక్కల్, క్రైమ్ మిర్రర్ :-

-మాల్ ప్రాక్టీస్ యత్నించిన వారిపై కేసు నమోదు

-:ఆరుగురు అరెస్ట్
గణితంలో వీక్ ఉన్న తన కొడుకుని ఎలాగైనా పాస్ చేయాలనుకున్న తండ్రి ఆరాటం కొడుకుతోపాటు పలువురిని కటకటాల పాలు చేసింది.కామారెడ్డి జిల్లా జుక్కల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.జుక్కల్ లో మాల్ ప్రాక్టీస్ కు యత్నించిన 11 మందిపై కేసు నమోదయింది.వీరులో ముగ్గురు పరారీలో ఉన్నారు.అరెస్టు చేసిన ఎనిమిది మందిలో ఇద్దరు విలేకరులు కూడా ఉన్నారు.కేసుకు సంబంధించి కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియాకు వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాల పరీక్ష కేంద్రంలో గణితం పరీక్ష రాస్తున్న విద్యార్థికి సబ్జెక్టు సరిగ్గా రాదు.దీంతో విద్యార్థి తండ్రి,పాఠశాలలో వాటర్ సప్లై చేస్తున్న వ్యక్తిని విద్యార్థి తండ్రి మాటలతో మంచి చేసుకొని,అతనికొక తెల్ల కాగితం ఇచ్చి తన కొడుకు వివరాలు చెప్పి ప్రశ్నలను రాసుకొని రావాలని పంపించాడు.తెల్ల కాగితాన్ని సదరు వ్యక్తి విద్యార్థికి ఇచ్చాడు.కాసేపటికి ఐదు ప్రశ్నలతో కూడిన ఓ తెల్ల కాగితాన్ని ఆ విద్యార్థికి సదరు వ్యక్తి అందించాడు.అతను ఆ కాగితాన్ని తిరిగి విద్యార్థి తండ్రికి ఇచ్చాడు.అనంతరం విద్యార్థి తండ్రి గ్రామపంచాయతీ కారోబార్ ఇచ్చి జవాబులు తేవాలని చెప్పాడు.ఆ పేపర్ ను ఫోటో తీసుకున్న కారోబార్,అక్కడే ఉన్న విలేఖరికి పంపించాడు.అలాగే ఆ పేపర్ కారోబర్ నుంచి యూట్యూబ్ విలేకర్ కు చేరగా అతని నుంచి మరో రిపోర్టర్ కు వాట్సాప్ లో పంపించారు.సదరు విలేఖరి ఆ పేపర్ ను ఓ క్లిప్పింగ్ తయారుచేసి లోకల్ గా ఉన్న డిజిటల్ మీడియా గ్రూపులలో షేర్ చేశాడు.తర్వాత ఓ మైనర్ బాలుడు పరీక్ష కేంద్రానికి వెళ్లి మరొక మైనర్ బాలుడి ఫోన్ నుంచి ప్రశ్నలతో కూడిన పేపర్ ను ఫోటో తీయించి కారోబర్ కు పంపించి డిలీట్ చేశాడు.పోలీసులు ఈ విషయాన్ని గుర్తించి,ప్రశ్నలు బయటకు వెళ్లకుండా విచారణ చేపట్టి,ఆరుగురి నిందితులను అరెస్టు చేశారు.కాగా ఓ యూట్యూబ్ ఛానల్ విలేకరితో పాటు,వాట్సాప్ గ్రూప్ అడ్మిన్,మరో మైనర్ పరారీలో ఉన్నారని జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి,ఎస్బి సిఐ తిరుపతిరెడ్డి,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

విమర్శలకు గురవుతున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ!..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments