
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన, జోహో ఫౌండర్ శ్రీధర్ ఇద్దరూ యువత పెళ్లి మరియు కెరీర్ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటగా ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో ఉపాసనా చిట్ చాట్ కార్యక్రమంలో భాగంగా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. చిట్ చాట్ లో భాగంగా ఐఐటి హైదరాబాద్ విద్యార్థులను మీలో ఎవరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు?.. అని ఉపాసన అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ప్రశ్నించగా వారిలో అమ్మాయిలు కంటే అబ్బాయిలు ఎక్కువగా చేతులు ఇచ్చారు. కెరీర్ కన్నా పెళ్లి పై అబ్బాయిలు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు అని.. యువతలో కెరీర్ పై దృష్టి పెట్టడం న్యూ ప్రోగ్రెసివ్ ఇండియా సంకేతమని ఉపాసన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు .
Read also : BJP Protest: ధాన్యం కొనుగోళ్లలో దోపిడీ.. రైతులను కాంగ్రెస్ ముంచుతుందన్న బీజేపీ!
అయితే యువత పెళ్లి కంటే కెరీర్ పై ఫోకస్ చేయడం న్యూ ప్రోగ్రెసివ్ ఇండియా సంకేతమన్న ఉపాసన వ్యాఖ్యలపై తాజాగా జోహో ఫౌండర్ శ్రీధర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యువ వ్యాపారవేత్తలు అలాగే స్త్రీ మరియు పురుషులు 20 ఏళ్లలోపే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాను అన్నారు. మన ఈ సమాజానికి జనాభాను అందించే డ్యూటీని ప్రతి ఒక్క యువత నిర్వర్తించాలి అని కోరారు. నేను చెప్పిన ఈ వివరాలన్నీ కూడా చాలా విచిత్రంగా, పాత చింతకాయ పచ్చడిలా మీకు అనిపించొచ్చు . కానీ కాలక్రమంగా భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుసరిస్తారు అని ఆయన పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఉపాసన కు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు మాత్రం కెరీర్ కన్నా పెళ్లిపై ఫోకస్ చేయాలన్న శ్రీధర్ ను సమర్థిస్తున్నారు.
Read also : మావోయిస్టు అగ్రనేత హిడ్మా చివరి లేఖ సంచలనం





