Monday, March 23, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో భయాందోళన సృష్టిస్తున్న క్యాన్సర్ కేసులు?

ఏపీలో భయాందోళన సృష్టిస్తున్న క్యాన్సర్ కేసులు?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు ప్రతి ఒక్కరిని కూడా అభయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పటి కాలంలో క్యాన్సర్ అనగానే ఆ వ్యక్తికి చికిత్స చేయలేము అంటూ డాక్టర్లు చెప్పేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో క్యాన్సర్ కు సరైన చికిత్స అందిస్తున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి బతుకుతాడో లేదో అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు ప్రతిరోజు కూడా పెరుగుతూ పోతున్నాయి. సరిగ్గా 2021 నుంచి 2025 వరకు కూడా మొత్తంగా లక్ష అరవై వేల కేసులు బయటపడ్డాయి అని అధికారులు వెల్లడించారు. పట్టణాల్లో మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి అని ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు గవర్నమెంట్ కి ఒక నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో చాలా వివరాలు ఉన్నాయి. ఈ క్యాన్సర్ రోగుల్లో అత్యధికంగా 65% వరకు మహిళలే ఉన్నారు అని తెలిపారు. ఇప్పటివరకు 12.6 లక్షల చికిత్సలు నమోదు కాగా ఈ చికిత్స అంతటికి కూడా 3061 కోట్ల రూపాయలు ఖర్చులైనట్లుగా అనివేదికలో వెల్లడించబడింది. రాష్ట్ర నలుమూలల క్యాన్సర్ రోగులు ఉన్నారు అని.. అయితే మరోవైపు వీటికి చికిత్స అందుబాటులో ఉంది అని తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా అబ్బాయి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని సూచించారు.

Read also :

Yumnam Khemchand: మణిపూర్ సీఎంగా ఖేమ్‌ చంద్, ప్రమాణం చేయించిన గవర్నర్ భల్లా!

వైసీపీ హిందూ ద్రోహి.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments