AIతో భయం అక్కర్లేదు.. విద్యార్థులకు ధైర్యాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి

క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్:- దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి లోనే కాకుండా తాజాగా విద్యార్థులకు సైతం ధైర్యం చెప్పారు. భారతదేశం ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పేరుగాంచింది. దానికి ప్రధాన కారణం గత 15 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ పరిపాలన అనే చెప్పవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా ఏఐ టెక్నాలజీకి భయపడుతుంది అని పిఎం నరేంద్ర మోడీ గ్రహించారు. దీంతో పరీక్ష పే చర్చ 9వ ఎడిషన్ లో భాగంగా స్టూడెంట్ లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాసేపు ముచ్చటించారు. ఇందులో భాగంగానే టెక్నాలజీ ద్వారా మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి కానీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కి ఎలాంటి విధంగాను భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఒక లీడర్గా ఎదగాలి అంటే ఎన్నో ప్రయత్నాలు చేయాలి అని… అలా చేస్తేనే భవిష్యత్తులో ఏదైనా సాధించగలమని ధైర్యాన్ని ఇచ్చారు. ఇక యువత ఏ వయసులోనైనా సరే స్టార్టప్స్ చేయవచ్చు అని తెలిపారు. బిజినెస్ పరంగా యువత రాణించాలి అంటే కచ్చితంగా కొంతమంది పరిశ్రమల నిపుణులు కలిసి వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అలాగే వారి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకోవచ్చు అనేది తెలుసుకోవాలన్నారు. అలాంటప్పుడు మాత్రమే యువత త్వరగా సక్సెస్ ఫుల్ అవ్వగలరు అని నరేంద్ర మోడీ సూచించారు.

Read also : కేటీఆర్, కిషన్ రెడ్డి పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు?

Read also : కేటీఆర్, కిషన్ రెడ్డి పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button