
-
కొంచెం కొంచెంగా కబ్జాకోరల్లో మాల్ రహదారి..!?
-
వాహనదారుల ఇక్కట్లు, పార్కింగ్ కు కష్టాలు..!?
-
రోడ్లపైకి వస్తున్న వ్యాపారాల సూచిక బోర్డులు, డెమో వస్తువులు!?
-
హైదరాబాద్ ట్రాఫిక్ ని తలపిస్తున్న మాల్ ప్రాంతం..!?
-
నిత్యం ప్రమాదాలు జరిగే ఆ రహదారిపై అధికారుల నిఘా కరువు..!?
నల్లగొండ నిఘా ప్రతినిధి( క్రైమ్ మిర్రర్) : నిత్యం ప్రమాదాలు జరిగే రహదారిపై, అధికారుల నిఘా కరువైంది.. అటు రంగారెడ్డి, ఇటు నల్లగొండ పట్టణాలను, కలుపుకొని ఉండే మాల్ రద్దీ ప్రాంతంగా మారింది.. నిత్యవసర వస్తువులే కాకుండా, హైదరాబాద్, నల్లగొండ, ఆంధ్ర బార్డర్లను వెళ్ళడానికి మాల్ అడ్డా అనే చెప్పుకోవాలి.. నిత్యం జనసంచారం ఉండే ఈ ప్రాంతంలో, ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువేనని చెప్పుకోవాలి..!? ఇది ఇలా ఉండగా వ్యాపారులు రహదారులను కబ్జా చేస్తూ, రోడ్లపైనే సూచిక బోర్డులు, డెమో వస్తువులు పెట్టి, వాహనదారులను ప్రమాదాలకు గురి చేస్తున్నారు.!? చిరు వ్యాపారుల దగ్గరి నుండి, పెద్ద వ్యాపారుల వరకు మాల్ రోడ్లను తమ అడ్డాలుగా మార్చుకుంటున్నారు..!?
Read More : కట్టడాలను తొలగించకుండా కాపు కాస్తుంది ఎవరు..?
రోడ్లపైనే వాహనాలు నిలపడం, రోడ్లపైనే వ్యాపారాలు పెట్టడంతో, మాల్ మరింత రద్దీగా మారిపోయింది.. నిత్యావసర వస్తువుల నుండి, వ్యాపార సరుకుల వరకు మాల్ సుపరిచితమే.. మర్రిగూడ ఎక్స్ రోడ్డులో ఉండే ట్రాఫిక్, కొంతమేరకు హైదరాబాద్ ను తలపిస్తుందంటున్నారు స్థానికులు. మార్బుల్స్ వ్యాపారులు ఏకంగా, రోడ్డును తమ సొంత జాగలా మలుచుకొని, డెమోను బయట పెట్టడంపై అనేక విమర్శలకు దారితీస్తుంది. రోజు వారి చిరు వ్యాపారులు తమ పరిధిలో, వ్యాపారం చేసుకుంటున్నప్పటికి, పెద్ద వ్యాపారులు మాత్రం రహదారులను కబ్జా చేస్తున్నారు.!? ఆర్అండ్బి అధికారులతో పాటు, సమన్వయ అధికారులు చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని వార్తలను చదవండి …
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముందే కాంగ్రెస్ కు షాక్.. నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేస్!
ఆర్‌టీసీ చార్జీల పెంపుపై బిఆర్‌ఎస్ నేతల బస్సు నిరసన యాత్ర