రాష్ట్ర మున్సిపల్ శాఖలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు.. బిల్డర్లకు లేఅవుట్ దారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణీత వ్యవధిలోని అనుమతులు ఇచ్చేలా ఏర్పాటులు చేస్తున్నామన్నారు.. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో బిల్డర్స్ అసోసియేషన్ నేతలు అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా నూతన సంస్కరణల గురించి వారికి వివరించారు మంత్రి నారాయణ.
నిబంధనలకు అనుగుణంగా 2014- 19 లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కు ఆన్లైన్ ద్వారా అనుమతులు ఇచ్చామని మంత్రి నారాయణ తెలిపారు. వైసిపి ప్రభుత్వం ఈ విధానాన్ని నిర్వీర్యం చేసి.. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని అవినీతిమయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించి.. టౌన్ ప్లానింగ్ అప్రూవల్ సిస్టంపై అధ్యయనం చేసేందుకు సుమారు 20 రాష్ట్రాలకు అధికారులను పంపామన్నారు. వారి నివేదిక ఆధారంగా.. నూతన సంస్కరణలను తీసుకొస్తున్నామన్నారు. అనుమతులను మరింత సులభతరం చేసేందుకు సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తున్నామన్నారు మంత్రి నారాయణ.
మున్సిపల్ శాఖ సర్వర్లతో అన్ని డిపార్ట్మెంట్ల సర్వర్లను అనుసంధానం చేసి.. వెబ్సైట్ ద్వారానే అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఐదంతస్తుల కన్స్ట్రక్షన్ లో ఏవైనా డీవియేషన్స్ వస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు.. క్రిమినల్ కేసులు బనాయిస్తామని హెచ్చరించారు. నిబంధన ప్రకారం బిల్డింగ్ కు సెట్ బాక్స్ వదలటంతో పాటు.. నూతన లేఔట్ లో కచ్చితంగా 9 మీటర్ల రోడ్డును వదిలేలా చూస్తామన్నారు. ఏ ఒక్కరికి ఇబ్బందులు లేకుండా.. నూతన సంస్కరణలను అమలు చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు, టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డర్స్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు..
మరిన్ని వార్తలు చదవండి ..
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?
పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్
ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి
టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్
20 నిమిషాల్లో బెజవాడ టు శ్రీశైలం.. ఆకాశంలో విహరిస్తూ సీ ప్లేన్ జర్నీ