తెలంగాణ

బాలకృష్ణ ఇంటికి బుల్డోజర్.. సీఎం రేవంత్ మరో సంచలనల

తెలంగాణలో వరుసగా హీరోలు ప్రభుత్వానికి టార్గెట్ అవుతున్నారు. హైడ్రా బుల్డోజర్లు మాదాపూర్ లో హీరో అక్కినేని నాగార్దునకు చెందిన ఎన్ కన్వెషన్ ను నేలమట్టం చేయడం సంచలనంగా మారింది. సిటీలో అక్రమ కట్టడాలు వేలల్లో ఉండగా.. నాగార్జున భవంతినే కూల్చేయడంపై రకరకాల చర్చలు జరిగాయి. కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్నాడనే కారణంతోనే హీరో నాగార్జునను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారనే వార్తలు వచ్చాయి. తాజాగా పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

తాజాగా తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయాలతో ముందుకు వెళుతోంది. చెరువులు, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ ను నేలమట్టం చేశారు. పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తాజాగా హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి అధికారులు మార్కింగ్ వేయడం సంచలనంగా మారింది.

హైదరాబాద్‌లోని కేబీఆర్‌పార్కు చుట్టూ ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అవసరమైన పిల్లర్లు వేయాల్సిన ప్రాంతాల్లో భూ పరీక్షలు జరిపే ప్రాంతాలను గుర్తించిన అధికారులు మార్కింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో ఉన్న మాజీ మంత్రి జానారెడ్డి ఇంటితో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లోని బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేశారు. జానారెడ్డికి సంబంధించిన కాంపౌండ్‌ వాల్‌తోపాటు బాలకృష్ణ ఇంటి భాగంలో కొంత మేర భూ సేకరణ కింద పోతుందని అధికారులు చెప్తున్నారు. అధికారులు బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేయడం సంచలనంగా మారింది. జానారెడ్డి, బాలకృష్ణలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది.

తన ఇంటికి మార్కింగ్ వేయడంపై జానారెడ్డి గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. నా ఇంటికే టెండర్‌ వేస్తారా.. సీఎంతో మాట్లాడతా.. ఎన్నో ప్రభుత్వాలను చూశా నా ఇంటి స్థలం ఇచ్చే ప్రసక్తే లేదని.. తన ఇంటి వద్ద మార్కింగ్‌ చేసేందుకు వెళ్లిన అధికారులపై కస్సుబుస్సులాడినట్టు అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది. జానారెడ్డి, బాలకృష్ణతో పాటు మరికొందరు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల ఆస్థు లు ఉండటంతో భూసేకరణ వ్యవహారం పెద్ద సవాలుగా మారుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button