
– కుటుంబ హత్యే కలకలం సృష్టించింది అంటున్న నిపుణులు
– సుద్దాల సమీపంలో జున్ను బాయ్ అనే మహిళ దారుణ హత్య
– ఘటనస్థలికి చేరుకొని పరిశీలించిన డిసిపి అక్షాన్స్ యాదవ్
– వివరాలు సేకరిస్తున్న సీఐ , స్ధానిక ఎస్సై పోలీస్ సిబ్బంది, క్లూస్ టీం & పోలీస్ జాగిలాలు
గుండాల క్రైమ్ మిర్రర్, యాదాద్రి భువనగిరి జిల్లా:-
గుండాల మండలం సుద్దాల గ్రామ సమీపంలో మహిళా దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు
అత్తమామలపై దాడి జరిగిన ఘటనలో జనగామ జిల్లా మండలం లింగాల గణపురం గ్రామం కళ్లెం చెందిన గుజులోతు జున్నూభాయ్ బతుకుతెరువు కోసం వలస వచ్చి భార్య భర్తలు గుండాల మండలంలో నివాసం ఉంటున్నారు గుజులోతు జున్నూభాయ్ (50) దారుణంగా కొట్టారు అక్కడికక్కడే మరణించింది గుజులోతు చిన్న రాజయ్య(60) తలపై గాయాలు అయ్యి స్పృహ కోల్పోయాడు ఈ ఘటన చోటుచేసుకుంది గ్రామస్తులు పోలీసులకు సమాచారం తెలపడంతో పోలీసులు హుటాహుటిన స్థలానికి చేరుకున్నారు అప్పటికే గుజులోతు జున్నాభాయ్ మరణించగా భర్త చిన్నరాజయ్య తలపై గాయాలు అయ్యి అక్కడి నుంచి నిందితులు పారిపోయారు స్థానికులను విషయం అడగగా వాళ్ళు కుటుంబంలో కొంతకాలంగా కుటుంబ గొడవలు జరుగుతున్నాయని చెప్పారు సంఘటన స్థలంలోనే గుజులోతు జున్నాభాయ్ చనిపోయింది మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు పోలీసులు కేసు నమోదు అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.