తెలంగాణ

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి .. విమర్శలు గుప్పించిన కేటీఆర్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇప్పుడు చేతులెత్తేస్తున్నారంటూ మండిపడ్డారు. తులం బంగారం, రైతు భరోసా, ఏకకాలంలో రుణమాఫీ ఏమయ్యాయని ప్రశ్నించారు. శనివారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అడ్డగోలు, పనికిమాలిన హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారని విమర్శించారు. తులం బంగారం ఇవ్వడానికి బంగారం దొరుకుతలేదా అంటూ ఎద్దేవా చేశారు. రైతు భరోసా ఏమైంది రేవంత్ రెడ్డి అని నిలదీశారు. అలాగే ఏక కాలంలో రుణమాఫీ ఏమైందని ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులు ప్రమాణ పత్రం ఎందుకు రాసివ్వాలని అడిగారు. రెండో పంటకు రైతు భరోసా ఇస్తారా లేదా అని వరుస ప్రశ్నలు సంధించారు. మూడో పంటకు ఎందుకు ఇవ్వరు అని మమ్మల్ని ప్రశ్నించిన రేవంత్.. కనీసం రెండో పంటకు ఇవ్వడం లేదని వ్యాఖ్యలు చేశారు.

Read Also : హైడ్రా కీలక నిర్ణయం.. ఇకపై హైడ్రా గ్రీవెన్స్‌, వారం రోజుల్లో హైడ్రా పోలీస్‌స్టేషన్‌!!

‘‘నువ్వు చీఫ్ మినిష్టర్ వా.. కటింగ్ మాస్టర్ వా’’ అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జపం లేకుండా రేవంత్ ఉండలేరంటూ సెటైర్ విసిరారు. రేవంత్ రెడ్డి అబద్దాల కోరు అని.. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు గుండు సున్నా తెచ్చారని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు రైతుభరోసాపై ఎక్స్‌ వేదికగా ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అలాగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘రైతు భరోసా ఇచ్చింది లేదు.. రుణమాఫీ సక్కగా చేసింది లేదు.. పెన్షన్ పెంచింది లేదు. ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేదు..కానీ.. ఆగమేఘాల మీద అనవసరమైన వాటి కోసం వేల కోట్ల ఖర్చు పెట్టేందుకు మనసొచ్చిందా? నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు.. అక్షరం మార్పు కోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చా? వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్లు ఖర్చుపెట్టినా.. తెలంగాణ అస్థిత్వాన్ని చెరపలేవు! నాలుగు కోట్ల గుండెలపై కెసిఆర్ చేసిన సంతకాన్ని మార్చలేవు..!’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి : 

  1. రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి సర్కార్ కసరత్తు.. దశల వారీగా విక్రయానికి నిర్ణయం!!
  2. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో పేలిన రియాక్టర్.. ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
  3. బాయ్స్ హాస్టల్‌లో దారుణ ఘటన.. ప్రియురాలి కోసం యువకుని దారుణహత్య!!
  4. తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. తెలుగు మహాసభల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  5. రోడ్డు భద్రత అవగాహనపై బైక్ ర్యాలీ.. 300 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button