తెలంగాణ

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. ఎమ్మెల్సీ కవిత

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇవాళ(సోమవారం) నిజామాబాద్‌లో పర్యటించిన కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగింది.. శిక్షలు తగ్గాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. క్రైం రేటు పది శాతం పెరిగిందన్నారు. పోలీసులు కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరగడం తప్ప ఏమీ చేయడం లేదని ధ్వజమెత్తారు. జిల్లాలో ఇంత పెద్ద నాయకులు ఉండి ఏం లాభమని.. బీజేపీ ఎమ్మెల్యేలను పని చేయనీయడం లేదని ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రజలను కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నారని చెప్పారు. ప్రజలను మభ్య పెట్టి కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఎప్పుడు వస్తారో తెలియదని మండిపడ్డారు.

Also Read : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ సూచన

ఆరు నెలల నుంచి పోలీస్ కమిషనర్ ఇక్కడ లేరని చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామన్నారని.. ఇంతవరకు ఎవరికీ రాలేదని కవిత అన్నారు. మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం.. గుట్కా దందా యథేచ్ఛగా సాగుతోందన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన వారు కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్‌ను అభివృద్ధి చేస్తారని అనుకుంటే ఇక్కడ హైడ్రా లాగా నిడ్రా తెస్తా అంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను భయాందోళనకు గురి చేయకుండా అభివృద్ధి పనులకు నిధులు తేవాలని కోరారు. రాబోయే రోజులు బీఆర్ఎస్ పార్టీవేనని చెప్పారు. కాంగ్రెస్‌ను నిలదీస్తే బీజేపీకి అంత ఉలుకు ఎందుకని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి : 

  1. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్ రెగ్యలర్ బెయిల్ పిటీషన్ పై తీర్పు వాయిదా
  2. చరణ్ సినిమా ఈవెంట్ కు డిప్యూటీ CM ను ఆహ్వానించిన దిల్ రాజ్!..
  3. పదవులకే వన్నే తెచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్.. సీఎం రేవంత్ రెడ్డి
  4. 12 సంవత్సరాల తర్వాత… బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం
  5. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు… సంక్రాంతి తర్వాత నియామకం!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button