
గండిపేట(క్రైమ్ మిర్రర్): మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని మైలర్ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ సత్యనారాయణను బుధవారం భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారంతో కలిసి పనిచేస్తామని సీఐ సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మైలార్ దేవ్ పల్లి డివిజన్ యువజన అధ్యక్షులు అక్కెం రాఘవేందర్ యాదవ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లేష్ ముదిరాజ్.మైసి రెడ్డి, నరేష్ యాదవ్, మధు, గోవింద్ రెడ్డి, మహేష్ కురుమ, ప్రశాంత్, పవన్ గుప్తా, సామల రాజు, శేఖర్ తదితరులు సీఐ సత్యనారాయణను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read also : Urea Supply: యూరియా సరఫరాపై అధికారుల ఫోకస్, యాప్ గురించి రైతులకు అవగాహన!
Read also : Prank Death: ప్రాంక్ చేద్దామనుకున్నాడు.. ప్రాణాలు పోయాయి!





