విజయదశమి రోజున బీఆర్ఎస్ లీడర్ హల్ చల్ చేశాడు. గన్ తో గాల్లోకి ఫైరింగ్ చేశారు. బీఆర్ఎస్ లీడర్ గాల్లోకి కాల్పులు జరిపిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు పరుగులు పెట్టారు. గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన స్థానికంగా కలకలం స్పష్టించింది.
బీఆర్ఎస్ సీనియర్ నేత, భువనగిరి లోక్ సభకు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన క్యామ మల్లేశ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని తన సొంతీరు శేరిపల్లిలో తన కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగ జరుపుతున్నారు. పండుగ సందర్భంగా శేరిగూడ సమీపంలోని మంగళ్ ప్లలిలో ఉన్న తన వ్యవసాయ భూమిలో కుటుంబసభ్యులతో కలిసి ఆయుధ పూజ చేశారు. ఆ తర్వాత గన్ తో గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.
బీఆర్ఎస్ నేత గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలియడంతో పోలీసులు పరుగులు పెట్టారు. సదర్ నేతను ఆరా తీశారు. గన్ కు సంబంధించిన పేపర్లను తెప్పించుకుని పరిశీలించారు. క్యామ మల్లేష్ పేల్చింది ఎయిర్‌గన్ అని, ప్రాక్టీస్ కోసం తెచ్చుకున్నాడని ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపారు. రెండేండ్ల క్రితం కూడా ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలోని శేరిగూడలో దసరా పండుగ సందర్భంగా ఓ బీఆర్ఎస్ లీడర్ గన్ తో గాల్లోకి కాల్పులు జరపి హంగామా చేశారు. అప్పడు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.