-
నాయకుల ముమ్మర ప్రచారం
-
మున్సిపల్ ఎన్నికలే కాంగ్రెస్ పతనానికి నాందీ
-
మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్, క్రైం మిర్రర్ః
పుర పోరులో బీఆర్ ఎస్ నాయకుల ప్రచార జోరో సాగుతుంది. నాయకులు ఎక్కడికక్కడే ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వినూత్న రీతిలో దూసుకపోతున్నారు.
బీఆర్ ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించి ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
ఈ మున్సిపల్ ఎన్నికల విజయంతోనే వారికి గుణపాటం చెప్పాలన్నారు. పార్టీ అభ్యర్థులు ఐక్యతతో పని చేసి ఘన విజయం సాధించాలని ఆశీర్వాదించారు.
తెలంగాణను బీడు భూమిగా మార్చిన కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి అన్నారు. బీఆరఎస్‌తోనే నగర అభివద్ధి సాధ్యమన్నారు.
ప్రజలు కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆరఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ముఖ్య నేతలంగా ప్రచారంలో….
కీలకమైన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటుగా ఆర్మూర్, బోధన్, భీంగల్ పురపాలక పీఠాలపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు నేతలంతా రంగంలోకి దిగారు.
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గంలోని భీంగల్ మున్సిపాలిటీని స్వాధీనం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నారు.
గెలుపు గుర్రాలనే ఎంపిక చేసి బరిలోకి దింపారు. ఆర్మూర్‌లో వరుసగా గులాబీ జెండాను రెపరెపలాడించేందుకు జీవన్ రెడ్డి చురుగ్గా వార్డుల్లో కలియ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
షకీల్ దంపతులు విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకపోతున్నారు. నిజామాబాద్ నగరంలో మరోసారి సత్తా చాటేందుకు బిగాల గణెళిశ్ గుప్తా తనదైన శైలిలో వ్యూహాలను రచిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. కామారెడ్డి పురపాలక సంఘం లో వరుసగా మూడోసారి బీఆర్‌ఎస్ జెండాను ఎగిరేసేందుకు ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ ప్రణాళికలు రచిస్తున్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి వీజీ గౌడ్‌తో సమన్వయం చేసుకుంటూ కార్యరంగంలో దూసుకు పోతున్నారు.
ఈ పోరులో కారు గుర్తుతో ప్రజల్లోకి బలంగా వెళ్లి వారి మద్ధతును కూడగట్టేందుకు బీఆర్‌ఎస్ నేతలంతా ప్రయత్నాలు మొదలు పెట్టారు.





