తెలంగాణ

ఫార్ములా ఈ కార్ రేస్‌లో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు!

తెలంగాణలో రాజకీయ సంచలనంగా మారిన ఫార్మూలా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నార్సింగ్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేయనుంది బీఆర్ఎస్. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయనున్నారు గులాబీ నేతలు. ఫార్ములా ఈ కార్ రేస్ లో అసలు ముద్దాయి సిఎం రేవంత్ రెడ్డి అంటోంది బిఆర్ఎస్. మాజీ మంత్రి కేటిఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై అనవసరంగా నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తోంది. సిఎం రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్రానికి రావలసిన పెట్టబడులు వెనక్కి పోయాయని పిర్యాదు చేయనున్నారు BRS నేతలు.

హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ఫార్మూలా ఈ కార్ రేసు కోసం FEO సంస్థకు హెచ్ఎండీకు చెందిన 45 కోట్ల రూపాయలను బదిలీ చేశారు. అయితే ఆర్థికశాఖ అనుమతి లేకుండా, రూల్స్ కు విరుద్దంగా హెచ్ఎండీఏ నిధులు ట్రాన్స్ ఫర్ చేశారన్నది ఆరోపణ. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే 45 కోట్ల రూపాయలు ఫార్మూలా సంస్థకు బదిలీ చేశామని ఐఏఎస్ అర్వింద్ కుమార్ చెప్పారు. దీంతో నిధులను రూల్స్ కు విరుద్దంగా బదిలీ చేశారని కేసు నమోదు చేసింది తెలంగాణ ఏసీబీ. ఈ కేసులోనే కేటీఆర్ ను ఏగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని విచారించారు ఏసీబీ అధికారులు. ఈడీ కూడా రంగంలోకి దిగి ముగ్గురిని ప్రశ్నించింది.

అయితే తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ పెంచటానికే ఫార్మూలా ఈ కార్ రేస్ సంస్థకు నిధులు ఇచ్చామంటున్నారు కేటీఆర్. FEO సంస్థకు రెండో విడత డబ్బులు రేవంత్ సర్కార్ ఇవ్వకపోవడం వల్లే ఈవెంట్ రద్దైందని చెప్పారు. రేవంత్ సర్కార్ డీల్ కొనసాగిస్తే ప్రభుత్వానికి 45 కోట్ల రూపాయల నష్టం వచ్చేది కాదంటున్నారు. సీఎం రేవంత్ నిర్వాకం వల్లే 45 కోట్లు రాకుండా పోయాయని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. ఈ విషయంలోనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయనుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button