
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- సహజంగా ఎక్కడైనా ఆడబిడ్డకు పెళ్లయితే ఇంటి పేరు మారుతుంది. కానీ కొంతమంది ఉద్యోగస్తులు.. ప్రముఖులు పుట్టింటి పేరును కొనసాగించుకుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది జరుగుతూ ఉంటుంది. కేసీఆర్ కూతురు కవిత కూడా… ఇప్పటి వరకు కల్వకుంట్ల కవితగానే రాజకీయాల్లో రాణిస్తూ వచ్చారు. కానీ… బీఆర్‌ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత… ఒక్కసారిగా ఆమె ఇంటి పేరునే మార్చేసింది బీఆర్‌ఎస్. ఆమె కల్వకుంట్ల కవిత కాదు.. దేవనపల్లి కవిత అంటూ కొత్త పిలుపు అందుకుంటోంది.
Read also : లండన్‌లో హరీష్‌రావు చిట్‌చాట్.. మన పార్టీకి కేసీఆర్ గారే సుప్రీం!
రాజకీయాలు.. చాలా డేంజర్. అంతా సక్రమంగా ఉంటే ఒకే.. తేడా వచ్చిందా… సొంత మనుషులు కూడా శత్రువులైపోతారు. కన్న బిడ్డలు.. తల్లిదండ్రులు, సోదరుల అనే తేడా ఉండదు. అందరూ పగ వారిగా మారిపోతారు. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబంలోనూ అదే జరుగుతోంది. బీఆర్‌ఎస్‌కు కొరకరాని కొయ్యగా మారిన కేసీఆర్ కుమార్తె కవిత… సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేశారు. వారు అవినీతి పరులంటూ విమర్శిస్తూ… ప్రత్యేర్థులకు అస్త్రాలు అందించారు. దీంతో.. ఆమెపై భగ్గమన్న బీఆర్‌ఎస్… కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సొంత తండ్రి, అన్న, బావ.. అందరూ ఆమెను దూరం పెట్టారు. తానూ తక్కువ తినలేదని నిరూపించుకున్నారు కవిత. బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో… బీఆర్‌ఎస్‌తో ఆమెకు ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
Read also : వావ్ అద్భుతం.. 34 ఏళ్ల మహిళకి 5.2 కేజీల బాలుడు జననం
కవిత తీరుపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆమెను కేసీఆర్ కూతురుగా గౌరవించేవారు.. ఇప్పుడు పరాయి బిడ్డగా భావిస్తున్నారు. కవితపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఆమె ఇంటి పేరును కూడా మార్చేశారు. కల్వకుంట్ల కవిత అని పిలిచిన బీఆర్‌ఎస్ నేతలు.. ఇప్పుడు దేవనపల్లి కవిత అంటూ పిలుస్తున్నారు. అందుకే అంటారు.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని. ఈరోజు పొగిడిన వారు.. రేపు తిట్టరనే నమ్మకం ఉండదు. ఇప్పటి వరకు తండ్రి ఇంటితోనే రాజకీయాల్లో రాణించిన కవితను.. కల్వకుంట్ల కవితగానే అందరూ పిలిచారు. అయితే.. ఇకపై అది కుదరదని తేలిపోయింది. అత్తింటి ఇంటిపేరుతోనే రాజకీయంగా పనిచేసుకోవాలని బీఆర్ఎస్ స్పష్టంగా, నిక్కచ్చిగా చెప్తున్నట్టు సమాచారం.