
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- రాష్ట్రంలోని నిజామాబాదులో గత శుక్రవారం నాడు కానిస్టేబుల్ ప్రమోద్ ను రియాజ్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. అయితే ఆ నిందితుడు రియాజ్ తాజాగా పోలీస్ ఎన్కౌంటర్ లో మరణించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ అనే నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించగా ఆత్మ రక్షణ కోసం పోలీసులు వెంటనే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు రియాజ్ అక్కడికక్కడే మృతి చెందినట్లుగా సమాచారం. మరి కాసేపట్లో సిపి సాయి చైతన్య దీనిపై మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
త్వరలోనే మరిన్ని వివరాలతో… మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ లో…
Read also : CMR షాపింగ్ మాల్స్, చందన బ్రదర్స్ అధినేత కన్నుమూత
Read also : భోజనానికి సరిపడా డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం : సమంత