
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ప్రతిరోజు సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా వ్యవరించాలని పోలీసులు హెచ్చరిస్తున్న కూడా పలువురు అప్రమత్తంగా లేకపోవడంతో వారి సంబంధించిన డేటా మొత్తం కూడా హ్యాకర్లు హ్యాక్ చేస్తూ సమస్యలు తెచ్చి పెడుతున్నారు. ఇక తాజాగా ఈ హ్యాకర్ల దాటికి తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. కేవలం మంత్రులు మాత్రమే కాకుండా వివిధ శాఖల అధికారిక వాట్సప్ గ్రూప్ లు హ్యాక్ అవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధార్ అప్డేట్ పేరుతో కొన్ని ప్రమాదకర APK ఫైల్స్ ఈ రాజకీయ నాయకుల వాట్సప్ గ్రూపుల్లో షేర్ అయ్యాయి. అవి నిజం అనుకోని కొంతమంది ఫైల్స్ ను ఓపెన్ చేయగా తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మిగతా కొంతమంది ఆ ఫైల్స్ ఓపెన్ చేయకపోవడంతో హమ్మయ్య అని ఊపిరిపించుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధార అప్డేట్ పేరుతో ఫైల్స్ గ్రూపులో షేర్ అవ్వగానే కొంతమంది జర్నలిస్టులు అవి ఓపెన్ చేయగా ఫోన్లు హ్యాక్ అయ్యాయని తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సైతం వెంటనే ఈ విషయంపై విచారణ చేపట్టినట్టుగా సమాచారం.
Read also : తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న నోబెల్ విన్నర్!
Read also : Ibomma క్లోజ్ ఓకే.. మరి Movierulz పరిస్థితి ఏంటి ?





