మన భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం ఆయన అనారోగ్య దృష్ట్యా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి బంధువులు మరియు అధికారులు వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఐసీయూ వార్డులోకి షిఫ్ట్ చేశారు డాక్టర్లు.
బన్నీ పై నాకెందుకు కోపం!… చట్టపరంగానే వ్యవహరించా: సీఎం
కొద్ది నిమిషాల పాటు ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్లు చికిత్స అందించారు. అయితే కొద్దిసేపటికి పరిస్థితి విషమం కారణంగా మన భారతదేశం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడం జరిగిందని డాక్టర్లు తెలియజేశారు. మన భారతదేశానికి ప్రధానిగా చాలా మంచి పనులు చేశారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ మరణ వార్తతో అందరూ కూడా షాకు కు గురయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చాలామంది మన్మోహన్ సింగ్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇక అంత్యక్రియలు ఎప్పుడూ, ఎలా జరుగుతాయనే వివరాలు తెలియాల్సి ఉంది.
విరాట్ కోహ్లీపై కఠిన చర్యలు విధించిన ఐసీసీ?
భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడుగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ 2004 మే 22వ తారీఖున భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2014 వరకు మన్మోహన్ సింగ్ భారతదేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించారు. దాదాపుగా 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా చేసిన మన్మోహన్ సింగ్ భారతదేశం ని అభివృద్ధి బాటలో నడిపించారు. అలాంటివి అతను ఇవాళ చనిపోవడం భారతదేశానికి తీరని లోటు.