
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టెన్త్ క్లాస్ విద్యార్థులు అలర్ట్. టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థుల పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యింది. 2026 మార్చి 16వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మార్చి 16వ తేదీన ప్రారంభమయ్యి ఏప్రిల్ ఒకటవ తేదీన ముగిస్తాయి అని వెల్లడించారు.
టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే:-
మార్చి 16 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
మార్చి 18 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20 – ఇంగ్లీష్
మార్చి 23 – మ్యాథమెటిక్స్
మార్చి 25 – ఫిజిక్స్
మార్చి 28 – బయాలజీ
మార్చి 30 – సోషల్
మార్చి 31 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్2
ఏప్రిల్ 1 – SSC ఒకేషనల్ కోర్స్ ఎగ్జామ్
ఈ పదవ తరగతి పరీక్షలన్నీ కూడా ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
Read also : అనుమానాస్పద స్థితిలో అంబటిపల్లి యువకుడు మృతి
Read also : తెలంగాణలో మారునున్న వాతావరణం.. మూడు రోజులపాటు వర్షాలు!





