
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్ష బీభత్సం కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. మొంతా తుఫాన్ పొంచి ఉన్న నేపథ్యంలో దాదాపు మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కృష్ణాజిల్లా లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ఈనెల 27, 28, 29 తేదీలలో సెలవులు ప్రకటించారు. మరోవైపు తూర్పుగోదావరి మరియు అన్నమయ్య జిల్లాలలో 27, 28 తేదీలలో సెలవులు ఇస్తున్నామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కాబట్టి విద్యాశాఖ అధికారుల మేరకు మూడు జిల్లాల ప్రజలు సెలవు దినాల రోజున విద్యార్థులందరూ కూడా వారి యొక్క ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి అని హెచ్చరించారు. ఈ తుఫాన్ కారణంగా మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు దంచి కొడతాయని హెచ్చరించారు. ఇక మిగతా మరికొన్ని జిల్లాలలో కూడా రేపు ఉదయం లోపు తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా సెలవులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అప్పటివరకు మిగతా జిల్లాలలో యధావిధిగా పాఠశాలలు జరుగుతాయని తెలిపారు. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని.. దూరపు ప్రయాణాలు వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు. ఈ తుఫాన్ కారణంగా ఈ నెల చివరాఖరి వరకు వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. కాబట్టి వాతావరణ శాఖ అధికారుల సూచనలు మేరకు జర అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.
Read also : ఇది పాఠశాల అంటే ఎవరు నమ్మరు…అధికారులు ఉన్నారా..? లేరా..?
Read also : బ్రేకింగ్ న్యూస్.. ప్రమాదం వెనుక మిస్టరీని చేదించిన పోలీసులు!





