Homeఆంధ్ర ప్రదేశ్ఒంటిమిట్టలో కనులపండువగా బ్రహ్మోత్సవాలు... సీఎం ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్ప‌ణ‌...!

ఒంటిమిట్టలో కనులపండువగా బ్రహ్మోత్సవాలు… సీఎం ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్ప‌ణ‌…!

ఒంటిమిట్ట‌, క్ర‌మ్ మిర్ర‌ర్: కడప జిల్లాలోని చారిత్రాత్మక ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్ర‌హ్మోత్స‌వాలు క‌న్నుల పండువ‌గా నిర్వ‌హించారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల‌తో కిక్కిరిసిపోయింది. . వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత కీలకమైన ఘట్టం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.

సాంప్రదాయ స్వాగతం: ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు, టీటీడీ అధికారులు ‘పూర్ణకుంభం’తో ఘనస్వాగతం పలికారు. తల మీద పట్టువస్త్రాల తట్టను మోస్తూ సీఎం చంద్రబాబు ఆలయ ప్రదక్షిణ చేసి, గర్భాలయంలోని సీతారామ లక్ష్మణులకు వాటిని అర్పించారు. ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మంలో సీఎం దంప‌తులు పాల్గొన మొక్కులు చెల్లించుకున్నారు. వారికి వేద పండితులు తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు.

ప‌ర్యాట‌క హ‌బ్‌గా ఒంటిమిట్ట‌ను తీర్చిదిద్దుతా…సీఎం

పూజ‌ల అనంత‌రం మీడియా స‌మావేశంలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడారు. ఒంటిమిట్ట‌ను ప‌ర్యాట‌క హ‌బ్‌గా తీర్చిదిద్దుతాన‌ని పేర్కొన్నారు. ఏకాశిలా న‌గ‌రంగా పేరుగాంచిన ఒంటిమిట్ట‌ను కేవ‌లం అధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌క కేంద్రంతగా తీర్చిదిద్దుతాన‌ని హామి ఇచ్చారు.మౌలిక సదుపాయాలు: భక్తుల సౌకర్యార్థం ఇక్కడ వసతి గృహాలు, అన్నదాన సత్రాలు మరియు రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. చారిత్రక వారసత్వం: పోతన భాగవతాన్ని రచించిన ఈ నేల విశిష్టతను చాటిచెప్పేలా ప్రత్యేక మ్యూజియం లేదా సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments