Monday, March 23, 2026
Homeక్రైమ్ప్ర‌మాద‌వశాత్తు కెనాల్‌లో ప‌డి బాలుడి మృతి

ప్ర‌మాద‌వశాత్తు కెనాల్‌లో ప‌డి బాలుడి మృతి

మండ‌లంలో విషాదం

ఆసిఫాబాద్, క్రైం మిర్ర‌ర్ః వాంకిడి మండలంలో మంగ‌ళ‌వారం ఐదు సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల బాలుడు కెనాల్‌లో ప‌డి మృతి చెందిన ఘ‌ట‌న విషాదాన్ని నింపింది.

వివ‌రాల్లోకి వెళితే చిన్న వాంకిడికి చెందిన గుర్నులే సోనేరావు కుమారుడు అక్షిత్ (5) గ్రామ సమీపంలోని కెనాల్ వద్ద వాష్ రూమ్కు వెళ్లి ప్రమాదవశాత్తుగా కెనాల్లో పడి మృతిచెందాడు.

ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. క‌ళ్ల ముందే కొడుకు నీళ్ల‌లో ప‌డి మృతి చెంద‌డంతో వారి రోదన లు మిన్నంటాయి.

అక్క‌డ ఉన్న‌ గ్రామస్థులను సైతం కంటతడి పెట్టించాయి. సంఘ‌ట‌న స్థ‌లానికి పోలీసులు చేరుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments