
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కృష్ణా జలాల వ్యవహారంలో కావాలనే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై బురదలు జల్లుతున్నారు అని.. ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో కెసిఆర్ కృష్ణాజలాలలో 299 టీఎంసీలు చాలు అని సంతకం చేసింది నిజం. పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రం అడిగిన నీటి వివరాల లెక్కలు ఇవ్వకుండా బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు నిర్లక్ష్యం చేశాయి అని అన్నారు. కాబట్టే ఈరోజు DPR ను కేంద్రం వెనక్కు పంపించింది అని స్పష్టం చేశారు. ఇప్పుడు మోసం చేసింది కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు కాదా.. మరి ఈ రెండు పార్టీలు ఇప్పుడు క్షమాపణలు కచ్చితంగా చెప్పాల్సిందే కదా అని ప్రశ్నించారు. తప్పులన్నీ మీరు చేసి తర్వాత కేంద్రం మీదకు నెట్టేయడం ఏంటి అని కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీలపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేంద్రం అన్ని విధాలుగా సహాయం చేస్తుంది అని.. ప్రజలు వాటిని గమనించాలి అని తెలిపారు.
Read also : కోనసీమ జిల్లా కలెక్టర్ కు తప్పిన పెను ప్రమాదం!
Read also : 2025లో అత్యధికంగా సంపాదించిన క్రికెటర్లు ఎవరో తెలుసా?





