
హత్నూర, క్రైమ్ మిర్రర్ :-
నర్సాపూర్ పట్టణ కేంద్రంలో విష్ణు ఉన్నత పాఠశాలలో శనివారం నాడు వైభవంగా బోనాల వేడుకలు నిర్వహించారు. ముందుగా గజమాల పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం బోనాల విశిష్టతపై పాఠశాల ఉపప్రధానోపాధ్యాయులు విశ్వనాథ్ మరియు ఇతర ఉపాధ్యాయులు ప్రసంగించారు. ఆ తరువాత 6 నుండి 10వ తరగతి విద్యార్థులు వివిధ జానపద గీతాలపై నృత్యప్రదర్శనలు చేశారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో విద్యార్థులు బోనాల పండుగ ఆవశ్యకతను తెలియజేశారు. కొంత మంది విద్యార్థులు భక్తి గీతాలను ఆలపించారు, గ్రామ దేవతల ఆకృతులతో విద్యార్థులు బోనాలను అందంగా ముస్తాలు చేసారు. మరికొంత మంది విద్యార్థులు పోతరాజుల విన్యాసాలతో అందరిని ఆకట్టుకున్నారు. ఇంకొందరు విద్యార్థులు అమ్మవారి ఆకృతులను చిత్ర లేఖన కళను ప్రదర్శించి తమ భక్తిని చాటుకున్నారు. చివరగా అమ్మ వారికి నివేదనగా సమర్పించిన ప్రసాదాన్ని విద్యార్థులందరికి వితరణ చేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు పాఠశాల యాజమాన్యం హర్షాన్ని వ్యక్తం చేశారు.