HomeజాతీయంMother’s Surname: పిల్లలకు తండ్రి ఇంటిపేరే ఉండాలా?, బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Mother’s Surname: పిల్లలకు తండ్రి ఇంటిపేరే ఉండాలా?, బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

  • తల్లి పెంపకంలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు అవసరంలేదు
  • రికార్డుల్లో తల్లి ఇంటిపేరు, తల్లి కులం అనే కాలమ్స్ పెట్టాలని ఆదేశం!

భారతీయ సమాజంలో పిల్లలకు తండ్రి ఇంటిపేరు పెడతారు. తల్లి ఇంటిపేరు అనేది సాధారణంగా ఉండదు. తాజాగా పిల్లలకు ఎవరి ఇంటిపేరు ఉండాలనే అంశంపై బాంబే హైకోర్టులో కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఆ బిడ్డలకు తండ్రి ఇంటిపేరు అసవరం లేదు!

కేవలం తల్లి పెంపకంలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు అవసరం లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. తండ్రి పేరు, కులం కూడా రాయాల్సిన పనిలేదని తెలిపింది. ఆ మేరకు పాఠశాల దస్త్రాల్లో ఇంటిపేరు, కులం పేర్లను మార్చి రాయాలని ఆదేశించింది.

12 ఏళ్ల బాలిక వినతికి స్పందించిన ధర్మాసనం

రికార్డుల్లో తండ్రి ఇంటి పేరును, కులం పేరును తొలగించి తల్లి ఇంటి పేరు, కులం పేరును నమోదు చేయాలంటూ 12 ఏళ్ల బాలిక చేసిన వినతికి స్పందించిన జస్టిస్‌ విభా కన్‌కన్‌వాడి, జస్టిస్‌ హితేన్‌ వెనెగావ్కర్‌ల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తల్లే సింగిల్‌ పేరెంట్‌ గా వ్యవహరిస్తూ ఆ బాలికను పోషిస్తుంటే ఆమె ఇంటిపేరు, కులమే బిడ్డకు కూడా వర్తిస్తాయని తెలిపింది.

Read Also:పాక్‌ బార్డర్ లో తెలంగాణ యువకుడి అరెస్ట్, ఇంతకీ అక్కడికి ఎందుకు వెళ్లినట్టు?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments