Thursday, March 26, 2026
Homeతెలంగాణమున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు

క్రైమ్ మిర్రర్, నల్గొండ జిల్లా ప్రతినిధి : చండూరు మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్కంఠగా కొనసాగుతున్న వేళ, 9వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న గంజి దుర్గా వెంకటేశం ప్రచారంలో వేగం పెంచారు. ఆదివారం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ, ఇంటింటా తిరిగి ఓటర్లను కలిశారు.

తొమ్మిదవ వార్డులో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి అంశాలపై తన కార్యాచరణను వివరించి ఓటును అభ్యర్థిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మున్సిపాలిటీలకు అందుతున్న నిధులు, వాటితో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ చైతన్య పరుస్తున్నారు.

ఈ ప్రచారానికి డివిజన్ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో, గంజి దుర్గా వెంకటేశం విజయం దాదాపు ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష అభ్యర్థులతో పోలిస్తే ప్రచారంలో ముందువరుసలో ఉన్న ఆయనకు వార్డు ప్రజల మద్దతు బలంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 9వ వార్డులో గంజి దుర్గా వెంకటేశం గెలుపు ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments