
బీజేపీకి రాజీనామా చేసిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బుజ్జగించకూడదని హైకమాండ్ నిర్ణయించిందని తెలుస్తోంది. అంతేకాదు ఏకంగా ఆయనపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైందని సమాచారం. పార్టీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పట్ల బీజేపీ సీరియస్ గా ఉందని చెబుతున్నారు.
రాష్ట్ర అధ్యక్ష్య పదవికి పోటీచేసేందుకు నామినేషన్ పత్రం ఇచ్చినా, అతను నామినేషన్ దాఖలు చేయకుండా పార్టీపై తీవ్ర విమర్శలు చేసినందుకు రాజాసింగ్ పట్ల సీరియస్‌గా ఉంది బీజేపీ హైకమాండ్. రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తూ, అతనిపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు లేఖ రాసేందుకు సిద్ధమైంది తెలంగాణ బీజేపీ నాయకత్వం. తన రాజీనామా లేఖలో స్పీకర్ కు రాజీనామా లేఖ పంపాలని కోరారు రాజాసింగ్. దీంతో అతని రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గోషామహాల్ ఉపఎన్నికను ఎదుర్కోవడానికి బీజేపీ ప్లాన్ చేసిందని అంటున్నారు.