
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తొడగొట్టారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల, పరిసర ప్రాంత ఫార్మా బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే లగచర్ల బాధిత రైతులను పరామర్శించారు ఎంపీ Dk. అరుణ. భారీ కాన్వాయ్ తో లగచర్ల కు చేరుకొని రైతులు, వారి కుటుంబాలను కలిశారు. ఉద్రిక్తత జరిగిన నాటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.అరెస్ట్ చేసిన పరిస్థితులు, పోలీసులు వ్యవహరించిన తీరు అరుణకు వివరిస్తూ కన్నీరు పెట్టుకున్న బాధితులు. మీ అభిప్రాయాలూ గౌరవించాలని నా తరపున మళ్ళీ లేఖ రాస్తానని ఈ సందర్భంగా డీకే అరుణ చెప్పారు.
లగచర్ల ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రఆవేదనకు గురి చేసి చేసిందని డీకే అరుణ అన్నారు. లగచర్ల తో పాటి పరిసర తండాలలో భూములు సేకరించి ఫార్మా పెట్టాలని చూశారని.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడి రైతులు మా భూములు ఇవ్వాలని చాలా రోజులుగా ధర్నాలు చేశారని తెలిపారు. ఆరోజు ఘటన తర్వాత అధర్మంగా రాత్రికి రాత్రి దాడులు చేసి భయపెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా? అరెస్టులు చేసిన మా భూములు ఇవ్వబొమని పట్టుదలతో ఉన్నారని.. రైతుల అభిప్రాయాలూ గౌరవించాలి కాని.. బలవంతంగా భూములు లక్కోవడం సరికాదని డీకే అరుణ స్పష్టం చేశారు.
ఫార్మా ఇండస్ట్రీ ముఖ్యం కాదు రైతులు, వారు నమ్ముకున్న భూములు ముఖ్యమని గుర్తించాలని డీకే అరుణ సూచించారు.కంపెనీలకు లబ్ది చేకూర్చాలని రైతులను ఇబ్బంది పెట్టొద్దని పోరాడామని తెలిపారు. ఒక ప్రయివేట్ కంపెనీ కోసం అమాయక రైతులను ఇబ్బందులు ఇబ్బంది పెట్టడం చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయన్నారు. ఒక ప్రయివేట్ కంపెనీ కోసం నీకు ఓట్లేసిన గెలిపించిన రైతులను కొట్టిస్తారా? అని నిలదీశారు. మొత్తం 57 మందిలో 24 విడుదల అయ్యారు మరో 15 మందికి కుడా బెయిల్ వచ్చేలా తన వంతు కృషి చేస్తానని మాట ఇచ్చారు.లగచర్ల రైతులను కలిసి భరోసాను ఇద్దామంటే నన్ను రానియ్యకుండా అడ్డుకున్నారని.. ఇక్కడి రైతుల పట్ల, వారి తరపున పోరాడుతున్న ణా పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉందన్నారు. ఇక్కడికి నేను వస్తే ప్రభుత్వానికి ఎందుకు అంతా భయమో అర్థం కాలేదన్నారు.