Monday, February 16, 2026
Homeతెలంగాణకరీంనగర్‌పై బీజేపీ జెండా

కరీంనగర్‌పై బీజేపీ జెండా

  • మేయర్‌గా ఎన్నికైన కొలగాని శ్రీనివాస్‌
  • డిప్యూటి మేయర్‌గా సునీల్‌ రావు
కరీంనగర్‌, క్రైమ్‌ మిర్రర్‌: మేయర్‌ పీఠంపై తీవ్ర ఉత్కంఠ రేపిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ను ఎట్టకేలకు భాజపా దక్కించుకుంది. మేయర్‌ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ వేసిన పాచిక పారలేదు. దీంతో కరీంనగర్‌ పట్టణ మేయర్‌గా ఆ పార్టీకి చెందిన కొలగాని శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో మేయర్‌ పీఠాన్ని కమలదళం కైవసం చేసుకుంది.
డిప్యూటీ మేయర్‌గా అదే పార్టీకి చెందిన సునీల్‌రావు ఎన్నికైనట్లఉ ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడంలో కేంద్రమంత్రి బండి సంజరు వ్యూహత్మకంగా వ్యవహరించారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో భాజపా అత్యధికంగా 30 స్థానాల్లో గెలిచి నప్పటికీ మ్యాజిక్‌ సంఖ్యను చేరుకొని పీఠాన్ని కైవసం చేసుకుంటుందా అనే విషయంలో సందిగ్ధత కొనసాగింది.
ఎట్టి పరిస్థితుల్లో మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజరు రెండ్రోజుల క్రితం ధీమా వ్యక్తం చేసినా ఆదివారం చోటుచేసుకున్న పరిణామాలు ఆసక్తిని రేపాయి. కాంగ్రెస్‌, భారాస, ఎంఐఎం, ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌(ఏఐఎఫ్‌బీ) సభ్యులు, స్వతంత్రులు కలిసి ఎలాగైనా కార్పొరేషన్‌ను తమకు అనుకూలంగా మలచుకోవాలనే విధంగా చక్రం తిప్పారు.
ఇందులో భాగంగానే హైదరాబాద్‌ నగర శివారులోని ఓ రిసార్టులో వేర్వేరుగా క్యాంపులు నిర్వహించారు. మేయర్‌ పదవి కోసం ఇరువర్గాలు భాజపా, కాంగ్రెస్‌ మధ్య సంఖ్యాపరంగా దోబూచులాట కొనసాగింది. చివరికి మేయర్‌ పీఠాన్ని భాజపా దక్కించుకోవడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు.
బీఆర్‌ఎస్‌ తటస్థంగా వ్యవహరించింది. బీఆర్‌ఎస్‌ ఎటువైపు మొగ్గు చూపకుండా తటస్థంగా ఉండటంతో, బీజేపీ అభ్యర్థి 34 ఓట్లతో విజయం సాధించారు. దీంతో మొదటి సారి కరీంనగర్‌ మేయర్‌ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది.ఇక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితాలతో హంగ్‌ నెలకొన్నప్పటికీ స్వంతంత్రులు, ఇతరుల అభ్యర్థులతో బీజేపీ మేయర్‌ పదవిని దక్కించుకుంది
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments